అల్లు అర్జున్ పాటకి డేవిడ్ డాన్సులు అల్లు అర్జున్ స్పందన

ఐపీఎల్ టీమ్ ఎస్ ఆర్ ఎచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అని అందరికి తెలిసిందే. అయితే డేవిడ్ వార్నర్ ఈ మధ్యనే టిక్ టాక్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ క్రికెటర్ తెలుగు పాటలకి డాన్స్ చేస్తు టిక్ టాక్ చేస్తున్నాడు. అది సోషల్ మీడియా వైరల్ అవుతుంది. డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి బుట్ట బొమ్మ సాంగ్ కి స్టెప్పులు వేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో.
అయితే ఈ వీడియో మన అల్లు అర్జున్ కూడా చూశాడు. చుసిన తర్వాత డేవిడ్ వార్నర్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మధ్య ట్విట్టర్ లో సంభాషణ జరిగింది. బుట్ట బొమ్మ మాత్రమే కాదు రాములో రాముల సాంగ్ కూడా వార్నర్ స్టెప్పులు వేశాడు. అయితే అల్లు అర్జున్ స్పందిస్తూ చంపేసావు వార్నర్ మరో అతిపెద్ద సప్రైజ్ ఇచ్చావు థాంక్యూ సోమచ్ అని అన్నాడు. అయితే వార్నర్ స్పందిస్తూ ఏదో అలా ట్రై చేశాను ఆ పాట అన్న డ్యాన్స్ అన్న నాకు చాలా ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో నటిస్తున్నారు ఫస్ట్లుక్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.