స్టార్ హీరో వద్దన్నాక విజయ్ దేవరకొండ కి దక్కిన సినిమా

విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, గీతగోవిందం, అర్జున్ రెడ్డి వంటి హిట్లతో మంచి పేరు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీస్తున్నారు. ఫైటర్ సినిమా హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని హిందీలో karan johar నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే గీత గోవిందం సినిమా తో విజయ్ దేవరకొండ మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. మొదటగా ఈ సినిమా దర్శకుడు అల్లు అర్జున్ తో సినిమా తీద్దామనుకున్నాడట. అల్లు అర్జున్ కి కథ చెప్పగా బాగా నచ్చింది కానీ మళ్లీ లవర్ బాయ్ గా నటించడం ఇష్టం లేక వేరే సినిమా ఒప్పుకున్నాడు. గీత గోవిందం సినిమా విజయ్ దేవరకొండ కు దక్కింది అలాగా స్టార్ అయిపోయాడు.