ఇండస్ట్రీ లో ఫామిలీ లాగా ఎవరు ఉండరు టాప్ హీరో లపై కామెంట్స్ చేసిన బెల్లంకొండ

ఇండస్ట్రీ లో ఫ్యామిలీ లాగా ఎవరు ఉండరు టాప్ హీరో లపై కామెంట్స్ చేసిన బెల్లంకొండ
Alludu adurs bellamkonda srinivas shocking comments on telugu film industry
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల వారసుల హవా నడుస్తుంది. వారి సినిమాలకు ఓపెనింగ్స్ తో పాటు మంచి కలెక్షన్లు వస్తాయి. అయితే కొందరు బ్యాగ్రౌండ్ లేకున్నా కూడా ఎంతో కష్టపడి హీరోలు అవుతుంటారు.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ స్టార్ ప్రొడ్యూసర్ కి వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమయ్యాడు. బెల్లంకొండ ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. రాక్షసుడు సినిమా తో మంచి నటనని కనబరిచాడు. అయితే ఈ సంక్రాంతి అల్లుడు అదుర్స్ అనే సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రమోషన్లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
ఈవెంట్ లో బెల్లంకొండ మాట్లాడుతూ ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ లాంటిదని అనుకున్నానని అయితే ఇక్కడికి వచ్చాక తెలిసింది అలాంటిదేమీ ఉండదని అయితే ఇప్పుడు తెలిసింది అనిల్ రావిపూడి మా కోసం రావడం నేను అనుకున్నది ఎంతో తప్పు అని ఋజువైంది. అనిల్ రావిపూడి మాకు ఎంతో సహకారం ఇచ్చాడు చాలా చాలా థ్యాంక్స్ అంటూ చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే ఈ సినిమా ఈ నెల 15వ తేదీన రిలీజ్ కాబోతుంది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నభానటేష్, ఇమ్మాన్యూల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.