పాట పాడటం పై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చిన బాలకృష్ణ ..

జూన్ 10 వ తారీఖున బాలకృష్ణ తన పుట్టినరోజు జరుపుకున్నారు అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ ఒక పాట పాడారు. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి పాట పాడారు బాలకృష్ణ. ఆ అయితే ఈ పాట పై కొన్ని విమర్శలు రావడం వలన బాలకృష్ణ దీనిపై స్పందించాడు. రామ్ గోపాల్ వర్మ తో పాటు చాలా మంది సెటైర్లు వేశారు. అయితే దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ తన తండ్రి ఒక స్ఫూర్తి ప్రదాత అని తన తండ్రి నటించిన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం అని అన్నారు. శివ శంకరి పాట పాడాలని చాలాసార్లు ఆ పాటను ప్రాక్టీస్ చేశాను అని చెప్పాడు. ఆ పాటని గొప్పగా పాడాను అని నేను అనట్లేదు కానీ నా వంతు ప్రయత్నం చేశానని మాత్రమే చెపుతున్నాను అని బాలకృష్ణ గారు అన్నారు.