బాలయ్య వద్దన్న మూవీ రవితేజ కి దక్కనుందా! లేటెస్ట్ న్యూస్

రవితేజ ప్రస్తుతానికి క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ ప్రతి సినిమాకీ తనకు తానే మేక్ఓవర్ కొత్తగా స్టైలిష్ గా కనిపిస్తాడు. అయితే ప్రస్తుతానికి రవితేజ ఒక మలయాళ సినిమాని ఒప్పుకున్నట్టు తెలిసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒక సీనిమాలో చేస్తున్నాడని ఈ సినిమాలో రెండు మంచి పాత్రలు ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి మొదటగా బాలకృష్ణ ను సంప్రదించగా బాలకృష్ణ దీనికి నో చెప్పాడట. అదే పాత్రను రవితేజ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు హక్కులను పొందారు. అయితే మలయాళంలో బిజు మీనన్ పాత్రను బాలకృష్ణ ను సంప్రదించారు. అయితే ఈ పాత్రను రవితేజ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంకొక పాత్రను పృధ్విరాజ్ నటించాడు మలయాళంలో. తెలుగులో రానా ను తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ సినిమా మల్టీస్టార్ సినిమా కి రూపొందించి భారీ ఎత్తున నిర్మించాలని నిర్మాతలు అనుకుంటున్నారు.