ప్రభాస్ తో సినిమా అంటే భయపడ్డాను.. బండ్ల గణేష్
Bandla Ganesh about Prabhas Movie

బండ్ల గణేష్, హరీష్ శంకర్, పివిపి వీళ్ల ముగ్గురి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ హాట్ టాపిక్ గా నిలిచాడు. అయితే బండ్ల గణేష్ ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తన లైఫ్ గురించి భవిష్యత్ గురించి చెప్పాడు. అయితే ఒకసారి ప్రభాస్ తో తీయడానికి ఛాన్స్ వచ్చిందని సినిమా విషయం లో అనుమానాలు ఉన్నాయని భయపడి వదిలేసుకున్నాను అని బండ్ల గణేష్ చెప్పాడు.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే ఒక మంచి సూపర్ హిట్ తో మీ ముందుకు వస్తానని చెప్పాడు. ముఖ్యంగా నూతన దర్శకులతో పనిచేయాలని ఉందని కొత్త దర్శకులకు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నా అని చెప్పారు. అంతేకాదు హరీశ్ శంకర్ గురించి మాట్లాడుతూ “ఎన్నో అనుకుంటాం కానీ వాటిని ఎక్కువగా సీరియస్ గా తీసుకోవద్దు” అని అన్నాడు హరీష్ శంకర్ తో భవిష్యత్తులో సినిమా చేయనని బండ్ల గణేష్ చెప్పాడు. అయితే గబ్బర్ సింగ్ తర్వాత చాలా మంది హీరోలతో పనిచేసే అవకాశం వచ్చింది కానీ క్యాన్సిల్ అయ్యాయి. ప్రభాస్ తో సినిమా కూడా ఛాన్స్ వచ్చింది ఆయనే అవకాశం ఇచ్చారు. లారెన్స్ దర్శకత్వంలో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాం. కానీ ఆ సినిమా చేయడానికి భయపడ్డాను. అయితే ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో ఒక మంచి హీరోతో సినిమా చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాను అని అన్నారు.