బండ్ల గణేష్ సైటైర్ ట్వీట్స్ లో ఆంతర్యం

తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు తిన్నాక ఎంగిలాకు అంటారు. నీతో అవసరం ఉన్నంత సేపు వరుసలు కలిపి మాట్లాడుతారు అవసరం తీరాక లేని మాటలు అంటగడతారు. శత్రువుకి మన విజయాలే కాదు మన పరాజయాలు కూడా తెలియాలి. అప్పుడే మనం వాటిని ఎలా ఎదిరించి నిలబడ్డ విషయం తెలుస్తుంది. ఇలాంటి నీతి వాక్యాలు చెప్తుంది ఎవరో కాదు బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్.
మొదటగా ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఆ తర్వాత బడా నిర్మాత అయ్యాడు. బండ్ల గణేష్ మొన్నటి ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేశాడు. అయితే ఆ తర్వాత ఈ రాజకీయాలు వద్దు సినిమాలు ముద్దు అంటూ మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. బండ్ల గణేష్ తన మాటలతో సోషల్ మీడియా లో ఉంటాడు ఇప్పుడు ఆ ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. అయితే బండ్ల గణేష్ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఎప్పుడు విమర్శలకు గురి అవుతుంటారు.
ప్రతిసారి పెట్టే పోస్టులు ఏదో ఆంతర్యం ఉంది అనేలా ట్వీట్ చేస్తాడు. అయితే ఇప్పుడు “తుంటున్నతసేపు ఇస్తరాకు తిన్నాక ఎంగిలాకు” అని అంటారని ట్వీట్ చేశాడు. అవసరం ఉన్నంత సేపు బాగా మాట్లాడి అవసరం తీరాక తిట్టుకుంటారు. అని పోస్ట్అ చేసాడు. అయితే కొంతమంది ఈ ట్వీట్ హరీష్ శంకర్ గారిని ఉద్దేశించి అన్నట్టు పోస్టులు పెట్టారు. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశారు. అందులో బండ్ల గణేష్ పేరు రాయడం మర్చిపోయాడు. అయితే ఆ తర్వాత మరో మరో ట్వీట్ తో బండ్ల గణేష్ పేరు మర్చిపోయారని చెబుతూ బ్లాక్ బస్టర్ నిర్మాత అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. బండ్ల గణేష్ మాట్లాడుతూ శంకర్ కి నేనే అవకాశం ఇచ్చానని హరీష్ రీమేక్ సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలరని డైరక్ట్ సినిమా తీసి హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను అని అన్నాడు అని సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి అయితే బండ్ల గణేష్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు ఆ విషయం బండ్ల గణేష్ చెప్పాలి.