చిరంజీవి కి అందరికంటే విభిన్నంగా విష్ చేసిన బండ్ల గణేష్

బండ్ల గణేష్ తెలుగు నటుడిగా నిర్మాతగా తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయమే. బండ్ల గణేష్ ఈ మధ్యనే రాజకీయాల్లోకి చేరి మళ్లీ ఇక రాజకీయాలు వద్దు అని బయటకు వచ్చేశారు. బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి భక్తుడు అని చాలా సార్లు చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న నాకు చాలా ఇష్టం అని పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ దేవుడు పవన్ కళ్యాణ్ కి భక్తుని అని చాలాసార్లు వేదికలపై చెప్పాడు. అవకాశం ఉన్న ప్రతిసారీ మెగా ఫ్యామిలీని చిరంజీవి గారిని పొగుడుతూ ఉంటాడు.
అయితే ప్రస్తుతం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు విష్ చేశారు. అలాగే బండ్ల గణేష్ కూడా మరోసారి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కొడితే సిక్సు కొట్టాలి చూస్తే చిరంజీవి సినిమా చూడాలి అని చిన్నప్పుడు అనుకునేవాడిని ఇప్పుడు తీస్తే తీయాలి రా చిరంజీవితో సినిమా తీయాలి అనిపిస్తుంది. ఏం జన్మ సార్ మీది సూపర్ అని ట్విట్ చేశాడు మీతో సినిమా తీయాలని ఉంది అని చెప్పకనే చెప్పాడు.