రానా కు ప్రముఖుల విషెస్ చిరంజీవి సూపర్ గా

రానా తన ట్విట్టర్ ద్వారా ప్రేమ విషయాన్నీ బయట పెట్టాడు. రాజామౌళి డైరెక్షన్ లో బాహుబలి సినిమాలో బల్లాల దేవ గా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో దేశమంతా పేరు సంపాదించుకున్నాడు. రానా ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు సంపాదించుకున్నాడు. కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో రానా తను ప్రేమించిన అమ్మాయి పేరు ఫోటోలు అభిమానులతో పంచుకున్నాడు. అయితే వెంటనే సెలబ్రిటీస్, ఫ్యాన్స్ అందరు కలిసి విషెస్ చెప్పారు. She Said Yes అంటూ సోషల్ మీడియాలో రానా పోస్ట్ చేశాడు.
అయితే దీనికి చిరంజీవి స్పందిస్తూ కంగ్రాట్స్ మై బాయ్ అని మెసేజ్ చేశాడు భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి త్వరలోనే పెళ్లి చేసుకోవాలని చిరంజీవి ట్వీట్ చేసారు. అంతేకాదు తమన్నాభాటియా కూడా కంగ్రాట్స్ చెప్తూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. చిరంజీవి ట్వీట్ పై స్పందిస్తూ మీకు థాంక్యూ సార్ అని ట్వీట్ చేసింది. రానా కు విషెస్ చెప్తూ హన్సిక మోత్వానీ, కృతికర్బందా, రామ్ చరణ్, శ్రియ శరణ్, ఉపాసన , సుశాంత్, నిహారిక అందరూ విషెస్ చెప్పారు.