హీరో విజయ్ మాస్టర్ మూవీ రివ్యూ రేటింగ్

Hero Vijay Master Movie Review Rating
హీరో విజయ్ మాస్టర్ మూవీ రివ్యూ రేటింగ్
Starring : Vijay, Vijay Sethupathi, Malavika Mohanan, Andrea Jeremiah
Movie : మాస్టర్ తెలుగు
నటీనటులు: విజయ్, విజయ్ సేతుపతి, మాళవికా మోహనన్, మరియు ఆండ్రియా జెరెమియా డైరెక్టర్ లోకేష్ కనకరాజు, సంగీతం అనిరుధ్, ఫోటోగ్రఫీ: సత్యం సూర్యం
Hero Vijay Master Movie Review Rating
తెలుగులో డబ్ అయిన ఖైదీ సినిమా తీసిన దర్శకుడే విజయ్ హీరోగా మాస్టర్ సినిమా కి దర్శకత్వం వహించారు. తమిళనాట విజయ్ వరుస హిట్లతో కొనసాగుతున్నాడు. మాస్టర్ సినిమాని తెలుగు తమిళంలో ఈ సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా కనకరాజు డైరెక్షన్ చేయడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ విషయానికి వస్తే భవాని (విజయ్ సేతుపతి) బాలనేరస్థుల కాలేజీలో అందులోని కుర్రాలందరిని తనకు నచ్చినట్టు వాడుకుంటాడు. కాలేజీ కి తాగి వచ్చి తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి రాక్షసుడుగా మారుతాడు. అయితే అక్కడికి జెడి హీరో విజయ్ మాస్టర్ గా వెళ్తాడు. వెళ్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు భవాని జెడి ల మధ్య ఎలాంటి వార్ నడుస్తుంది అన్నదే ఈ సినిమా కథ.
ఫస్ట్ నటన గురించి చెప్పాల్సి వస్తే విజయ్ ఎంత అద్భుతంగా నటించాడో విజయ్ సేతుపతి కూడా అంతే అద్భుతంగా నటించాడు. ఇద్దరు పోటాపోటీగా వారి పాత్రలకు న్యాయం చేశారు విజయ్ సేతుపతి అద్భుతమైన విలనిజాన్ని పండించాడు. ఇందులో విజయ్ చాలా యంగ్ లుక్ తో స్టైలిష్ గా కనిపించాడు. మిగతా నటీనటులు కూడా బాగా నటించారు.
ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు అనిరుద్ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంతేకాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అద్భుతంగా ఇచ్చాడు. అనిరుథ్ మ్యూజిక్ వల్ల సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది యాక్షన్ పార్ట్శ్ లో హీరో విజయ్ ని అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది కాకపోతే సినిమా కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది. ఫైనల్ గా ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతోంది అంతేకాదు టైంపాస్ కి వెళ్లే వాళ్లకి కూడా పర్వాలేదు అనిపిస్తుంది.
Hero Vijay Master Movie Review Rating
రేటింగ్ : 3/5