సుశాంత్ సూసైడ్ పై! నిజాలు చెప్పడానికి నేను రెడీ కానీ !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ కపూర్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసిన విషయం. అయితే బాలీవుడ్ లో సెప్టోసిం కూడా ఉందని, బంధు ప్రీతి ఉందని చాలా విమర్శలు వస్తున్నాయి. కావాలని ఎవరో తొక్కేశారా అని అంటున్నారు. ఎదగనీయకుండా చేశారని కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంపై మీరాచోప్రా స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పడానికి నాతో పాటు చాలామంది రెడీగా ఉన్నారు. మనకు వ్యతిరేకంగా వాళ్ళందరూ ఎలా పని చేస్తారు. కొందరు దర్శకులు మానసికంగా ఎలా హింసిస్తారు. అయినా తెలివైన వారు ఎవరు ఇలా చేయరు. నేను ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాను. అయితే నేను చెప్పడం అంటూ మొదలు పెడితే నాతోని ఎంత మంది మద్దతు ఇస్తారు. ఇండస్ట్రీలో సినిమాలు, పనుల కోసమే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. డిగ్నిటీ, ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి అని మీరా చోప్రా చెప్పుకొచ్చింది.