తిండి కూడా దొరకలేదు చాల సార్లు బస్టాండు లో పడుకున్న జబర్దస్త్ నటుడు

నటుడు కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ కి వస్తున్నారు. కృష్ణానగర్ లో ఉంటూ అవకాశాల కోసం అన్ని ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా చాలామంది ఎన్నో కష్టాలు పడుతుంటారు. అందులో ఒక నటుడు జబర్దస్త్ లో ఇప్పుడు పాపులరైన జబర్దస్త్ ఆనంద్ తాను కూడా ఎన్నో కష్టాలు పడుతూ తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడట. చాలాసార్లు బస్టాండ్లో పడుకునే వాడిని అని చెప్పాడు తిండి కోసం గుడికి వెళ్లి అక్కడ భోజనం చేసి అక్కడే ఒక దగ్గర ప్లేస్ చూసుకొని పడుకొనే వాడిని. అప్పుడప్పుడు పోలీసులు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు అప్పుడు బిచ్చగాళ్ల దగ్గర ప్లేస్ చూసుకొని అక్కడే పడుకొనే వాడిని. అప్పుడప్పుడు తిండిలేని రోజులు కూడా గడిపేవాడిని అని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి జబర్దస్త్ లో అవకాశం పొందాను. ఇప్పుడు కాస్తోకూస్తో సంపాదిస్తున్నాను అని జబర్దస్త్ ఆనంద్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.