డైరెక్టర్ కాబోతున్న జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్ పి ..ప్రముఖ నటుడి తో

తెలుగు టెలివిజన్ చరిత్రలో కామెడీ అద్భుతంగా పండిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం టి ఆర్ పి లో దూసుకుపోతుంది. ఇందులో వచ్చే జబర్దస్త్ నటులు జడ్జి యాంకర్ అందరూ ఫేమస్ అయ్యారు. ఈ ప్రోగ్రాంలో వచ్చిన నటులకి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రోగ్రాం వల్ల యాంకర్ లకు కూడా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.
అయితే ఈ జబర్దస్త్ లో బాగా పాపులర్ అయిన కిరాక్ ఆర్పి ఇప్పుడు మెగాఫోన్ పట్టుకున్నాడు. జేడీ చక్రవర్తి ప్రధానపాత్రలో దర్శకత్వం వహించబోతున్నాడని తెలిపాడు. శ్రీ పద్మజా పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్పి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి నాగబాబుగారు అతిథిగా విచ్చేశారు కిరాక్ ఆర్పీ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. నాగబాబు తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ జబర్దస్త్ ప్రోగ్రాం లో నన్ను ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్గా ఒక మంచి స్టోరీ కుదరడంతో ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. స్టోరీ నచ్చడంతో జెడి చక్రవర్తి గారు ఈ సినిమాను ఒప్పుకున్నారు. ఈ సినిమాలో జె.డి.చక్రవర్తి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రకాష్ రాజు, రావు రమేష్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని ఆర్పి చెప్పాడు.