ఎన్టీఆర్ తో అనుబంధం ..రాజమౌళి

ఎన్టీఆర్ రాజమౌళి వీళ్ళిద్దరూ దాదాపు ఒకేసారి విజయాలు మొదలు పెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో మొదలైన విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజమౌళి గారు ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేశాడు. 3 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ ఈ మూడు పెద్ద హిట్ అయ్యాయి. సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కి అంతులేని మాస్ ఇమేజ్ ని సంపాదించింది. అయితే వీరిద్దరికీ మంచి అనుబంధం కూడా ఉంది. రాజమౌళి గారి ఇంటర్వ్యూ లో రాజమౌళి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో నాలుగో సారి కలిసి పని చేస్తున్నారు రాజమౌళి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేకపోయినా టీజర్స్ లేకపోయినా రాజమౌళి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టు చేశాడు. నా సినిమా ప్రయాణం మొదలైనప్పటి నుంచి నువ్వు నా పార్టనర్ గా ఉన్నావు అందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ బర్త్ డే తారక్ నీ కంటే మంచి భీమ్ నేను కనిపెట్టలేను అని రాజమౌళి అన్నాడు.