నందమూరి ఎన్టీఆర్ ఫాన్స్ కి నిరాశ

మే 20 నందమూరి తారకరామారావు పుట్టిన రోజు. ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఈ సినిమాని భారీ ఎత్తున తీస్తున్నారు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా రిలీజ్ చేయట్లేదు.
జన్మదిన వేడుకలకు ఎన్టీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో తన అభిమానులకు ఎన్టీఆర్ లేఖ రాశాడు. కరోనా సమయంలో మీరు మీ ఫ్యామిలీ అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. మనమందరం కలిసి పోరాడితే ఈ సమస్య నుంచి బయట పడతాము అని చెప్పాడు. కాబట్టి మీరందరూ ఇంటివద్దనే ఉంటూ సురక్షితంగా ఉండాలని ఎన్టీఆర్ అన్నారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి అని భావిస్తాను. మీరందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని నా విన్నపం. ఇదే మీరందరూ నాకు ఇచ్చే విలువైన బహుమతి అని అన్నాడు అయితే ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పుడు విడుదల చేయడం లేదని మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తాను. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేస్తామని చెప్పాడు.