సినిమా వారసులపై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్

మహేష్ బాబు హీరోగా నేనూఒక్కడినే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా నటి కృతి సనన్.. సినిమా అంతగా ఆడకపోయినా కృతి బాగా నటించిందని మంచి పేరు వచ్చింది. మొదటి సినిమా కె మహేష్ బాబు తో నటించే అవకాశం కొట్టేసింది. కానీ తర్వాత అవకాశాలు అంతగా రాలేదు.
అయితే ఈ హీరోయిన్ బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేసింది. అక్కడ పలు హిందీ సినిమా లలో నటించి మంచి పేరు తెచ్చుకొని క్రేజీ నటిగా మారిపోయింది. అయితే బాలీవుడ్ వారసులపై సంచలన కామెంట్స్ చేసింది ఈ హీరోయిన్.
బాలీవుడ్ లో కూడా నట వారసులు దూసుకుపోతున్నారు. వారికీ అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ విషయం లో కీర్తి సనన్ కామెంట్స్ చేసారు. సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు ఎక్కువ గా వస్తున్నాయని అన్నారు. మిగతా వారికీ ఒక్క అపజయం వచ్చిన సరే సరైన అవకాశాలు రావడం లేదని ఈ బాలీవుడ్ బ్యూటీ అన్నారు. ఇంకా కామెంట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ బంధువలపైనా ఎక్కువ ప్రేమ ఉంటుందని వారికే అవకాశాలు వస్తయని అంటుంది.