మరోసారి మంచి మనిషి మనసును చాటుకున్న మహేష్ బాబు

ఎప్పుడు సినిమాలతో యాడ్స్ తో బిజీగా ఉండే మహేష్ బాబు సహాయం చేయడంలో కూడా ముందుంటాడు. చాలాసార్లు ప్రభుత్వానికి బాధితులకు కొంత డొనేట్ చేస్తూ ఉంటాడు. చాల మందికి తెలియని సహాయ కార్యక్రమాలు చేస్తాడు. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ సహాయం చేసే గుణం కొందరికే ఉంటుంది. అది మహేష్ బాబు కి చాలా బాగా ఉంది. హెల్త్ విషయంలో చాలామంది చిన్న పిల్లలకి వాళ్ల ఆపరేషన్లకు ఎంతో గొప్ప సహాయం చేస్తున్నాడు.
తాజాగా మరో పాపకు ఆపరేషన్ కి కావలసిన ఏర్పాట్లు చేశాడు. ఇప్పటివరకు వెయ్యికి పైగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయించాడు. అంతేకాదు కొన్ని హాస్పిటల్ వారి ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. అయితే ట్విట్టర్ లో ఒకతను ఒక పాప కి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని ట్విట్టర్లో మహేష్ బాబు కి పోస్ట్ పెట్టాడు. మహేష్ బాబు తన టీమ్ ద్వారా ఈ వార్త తెలుసుకుని పాపకి ఆంధ్ర హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించాడు. ఇప్పుడు ఆ పాప క్షేమంగా ఉంది ఇలా చాలా మంది పిల్లలకు మహేష్ బాబు ఆపరేషన్ చేయించి ప్రాణదానం చేశాడు . సినిమాల్లోనే కాదు సీరియల్ లైఫ్ లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు ఈ సూపర్ స్టార్.