మహేష్ బాబు కొత్త సినిమా ఎప్పుడు టైటిల్ ఏంటి ?

పోకిరి అతిధి వంటి మాస్ సినిమా ల తర్వాత మహేష్ బాబు మళ్ళి అలంటి సినిమా చేయలేదు. ఎప్పటి నుంచో మాస్ సినిమా చేయాలనుకుంటున్నా మహేష్ బాబు అది సరిలేరు నీకెవ్వరు నీకెవ్వరు తో ఆ కోరిక తీరి పోయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే మహేష్ బాబు తర్వాత సినిమా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. కథా చర్చలు జరుగుతున్నా కూడా ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. గీత గోవిందం లాంటి మంచి సూపర్ హిట్ ఇచ్చిన పరుశురాం మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ మధ్యనే కలిసి మహేష్ బాబు కి కథ చెప్పి ఒప్పించాడు. సినిమా పేరు సర్కారీ వారి పాట అనే టైటిల్ తో వస్తుందట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజైన మే 31 తారీకు నా తెలుస్తుంది. ఆ రోజునే షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.