మహేష్ బాబు రాజమౌళి బిగ్ బడ్జెట్ సినిమా ఓకే అయింది

బాహుబలి సినిమా తో రాజమౌళి నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది . ప్రస్తుతానికి రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.
అయితే ఎప్పటినుంచో రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా ఉంటుందని అంటున్నారు. అటు మహేష్ బాబు కూడా ఇంటర్వ్యూ లో రాజమౌళి తో ఒక సినిమా ఉంది చేయాలి అని కూడా అన్నాడు. కానీ ఇన్ని రోజులు కథ సెట్ కాకపోవడంతో ఆ సినిమా షూటింగ్ దశలో కి రాలేదు. అయితే ఇప్పుడు కథ కూడా ఓకే కావటం త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెడతారు అని తెలిసింది. అయితే రాజమౌళి ఒక ఫంక్షన్ లో మహేష్ బాబుతో చేస్తే జేమ్స్ బాండ్ మూవీ లాంటిది చేస్తా అని అన్నాడు . అయితే ఈ నెల 31 న మహేష్ బాబు గారి తండ్రి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సినిమా గురించి చెప్పవచ్చు. అయితే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో చేయాలనుకుంటున్నారట రాజమౌళి గారు.