సర్కారు వారి పాట పరశురామ్ మహేష్ తో చేసే కథ ఇదేనా !

సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ తో మహేష్ బాబు సంక్రాంతికి కలెక్షన్ల వర్షం కురిపించాడు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత పరశురామ్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. సినిమా పేరు సర్కారు వారి పాటగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా మాస్ గా ఉండడంతో ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అంతే కాదు సినిమా కోసం మహేష్ బాబుతో సహా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కథ పై చాలా మంది చాలా రకాలుగా ఇది ఎలాంటి కథ ఇలాంటి కదా అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ మాస్ గా స్టైలిష్ గా ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంకు ఉద్యోగి కొడుకుగా నటిస్తున్నాడు అని అంటున్నారు. ఈ సినిమా మూలకథ ఆర్థిక నేరాలకు సంబంధించినది అని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని అందర్నీ అలరిస్తుందని మహేష్ బాబే స్వయంగా చెప్పారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం.
Movie Name : Sarkaru Vari Pata
Director: Parshuram
Hero: Mahesh Babu