ఐయమ్ సారీ ప్రభాస్ అంటున్న సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్ లో తెలుగు యువ హీరోలు అంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నిఖిల్ ,నితిన్ రానా వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే చాలామంది ఇక తర్వాత ప్రభాస్ అని అంటున్నారు. ప్రభాస్ పెళ్లి విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశాడు. రేపు ఉదయం ఒక మంచి కబురు చెబుతానని ట్వీట్ చేశాడు. అయితే అది పెళ్లి గురించి అని అందరూ అంటున్నారు. ప్రభాస్ కు సారీ చెబుతూ ట్వీట్ చేశాడు. ఇక తన వంతు వచ్చింది అని అంటున్నాడు సాయి.
ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం. కానీ ఇప్పుడు మన టైం వచ్చినప్పుడు…. అని ఒక చిన్న వీడియో చేశాడు. రేపు ఉదయం 10 గంటలకు అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నాడు వీడియో లో సింగిల్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్ కన్వర్జేషన్ చూపించాడు. అందులో నితిన్ నిఖిల్ రానా వీళ్ళందరూ బ్యాచిలర్ లైఫ్ కి టాటా చెప్పి పెళ్లి చేసుకున్నారని ఇట్స్ మై టైమ్ సారీ ప్రభాస్ అని ట్వీట్ చేశారు. అంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నరని అర్థమవుతుంది. ప్రస్తుతం సాయి తేజ్ చిత్రలహరి, ప్రతి రోజు పండగే వంటి హిట్ల తర్వాత సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమా చేస్తున్నాడు.