మీ పిల్లలు అయితే ఇలా చేస్తారా అంటున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పెద్దన్న పాత్ర పోషిస్స్తున్నాడు. ఇండస్ట్రీ గురుంచే కాకుండా బయట కార్యక్రకణాలకు కూడా వెళ్తున్నాడు. ఒక వీడియో ద్వారా యువతకు తన సందేశాన్ని అందించాడు. అయితే ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడారు. కొంతమంది యువకులు డ్రగ్స్ బారిన పడి తమ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనిషి జీవితం అనేది ఎంతో గొప్పది ఎన్నో జన్మల పుణ్యఫలం. మనిషి జీవితం దాన్ని డ్రగ్స్ వాడుతూ నాశనం చేసుకోవద్దు అని అన్నారు. నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పారు. మీరు ఇలా డ్రగ్స్ వాడకం వల్ల మీ తల్లిదండ్రులు ఎంతో బాధకు గురి అవుతున్నారు. ఇలా మీ పిల్లలకు అయితే చేస్తారా అని అడిగాడు. ఇలాంటి యాంటీ డ్రగ్ ప్రచారానికి ముందుకు వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ని అభినందిస్తున్నాను చిరంజీవి గారు అన్నారు.