ఆచార్య లో మెగాస్టార్ రోల్ ఏంటి! టాప్ స్టార్ హీరో స్పెషల్ రోల్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పేరు ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవాలని చిరంజీవి కోరుకుంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ గా కనిపించాలని డిసైడ్ అయ్యాడట. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర ఎండోమెంట్ అధికారిగా ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి డబల్ ఆక్షన్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నిహారిక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సంగీత దర్శకత్వం మణిశర్మ వహిస్తున్నాడు.