రాముడి ల కర్ణుడి లా భతకద్దు …విగ్గులు వాడను అంటున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు గారు ఈ మధ్య మంచి మంచి విషయాల మీద యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాడు. నాగబాబు గారు అసలు తన ఆలోచన ఏంటి తన ఆలోచన విధానం ఎలా ఉంటాయో వీడియోలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా హీరోలు ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కు పోవడం గురించి వీడియో చేశారు. నటులు ఇమేజ్ చట్రంలో మాస్ ఇమేజ్ అని పెట్టుకుని మంచి సినిమాలు చేయలేకపోతున్నారు. ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కు అంటే అది వాళ్లకు ప్రమాదమే.
అయితే ఇలాంటివి పురాణాలనుంచి ఉందని అంటున్నాడు. హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, కర్ణుడు, శ్రీరాముడు వీళ్లంతా అలాంటివారే. సమాజంలో కూడా చాలామంది ఈ చట్రంలో ఇరుక్కొని బాధపడుతున్నారు. ఆడిన మాట తప్పరాదు అనే కదా సత్యహరిశ్చంద్రుడు కర్ణుడు బలిచక్రవర్తి వీళ్లంతా వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఇచ్చిన మాట కోసం అంతలా ప్రాణ త్యాగం చేయకూడదు వీలైనంతవరకు ప్రయత్నం చేయాలి కానీ తర్వాత కుదరకపోతే మన వల్ల కాదని వదిలేయాలి. సమాజంలో మంచివాడిగా బతకడం చాలా కష్టం నీచుడు వెధవ లాగా బతకడం చాలా ఈజీగా ఉంటుంది అని అన్నాడు. అయితే ఇందులో రజనీకాంత్ పేరు కూడా తీసుకొచ్చారు. రజినీకాంత్ విగ్గులు పెట్టుకోడని అన్నాడు. ప్రతి ఒక్కరూ శ్రీరాముడి లాగా బతకడం కుదరదు. అందరూ మనిషి మనిషి లా బతకాలి అని చెప్పాడు. అయితే నాగబాబు దగ్గరికి వచ్చి అందరు సాయం అడిగితే నేను చెయ్యను అని చెప్పాడు. ఎవరికైనా కొంతమందికి నాకు వీలైతే మాత్రమే సహాయం చేస్తాను.
అయితే పాత నటుడు చిత్తూరు నాగయ్య గారి గురించి కూడా చెప్పాడు. చిత్తూరు నాగయ్య గారు విపరీతమైన దానధర్మాలు చేసేవాడు ఎలా అంటే తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ దానధర్మాలు చేసేవాడు. అయితే ఈ విషయంపై కొంతమంది నెటిజెన్స్ ఎవరు వాళ్ళ వాళ్ళ characters మార్చుకోరు అని అంటున్నారు. మరికొంతమంది వర్మ లా మాట్లాడవు అని అన్నారు.