నాగ బాబు మరో సంచలన ట్వీట్ ..ఈసారి జగన్ ప్రభుతం పై

మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ లో ఏదో ఒక కామెంట్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నాగబాబు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశాడు. జగన్ ప్రభుత్వం తిరుమల ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు తో పాటు అక్కడ అక్కడ ఉన్న శ్రీ వారి భూముల ను అమ్మకానికి పెట్టింది. జగన్ గవర్నమెంట్ పై హిందూ సంస్థల నుండి ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిని ఎలాగైనా అడ్డుకుంటామని అంటున్నాయి. అయితే ఈ విషయంపై స్పందిస్తూ నాగబాబుగారు ఏడుకొండలవాడా గోవిందా గోవిందా ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి అంటూ ట్వీట్ చేసాడు. జగన్ ప్రభుతం తీసుకున్న ఈ నిర్ణయం పై అంతటా విమర్శలు ఎదురవుతున్నాయి.