నాగ బాబు సంచలన వ్యాఖ్యలు ..గాడ్సే గురుంచి
Nagababu Shocking Comments on Nathuram Gadse

మెగా బ్రదర్ నాగబాబు మెగా ఫ్యామిలీ లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండి క్లారిఫై ఇచ్చేది నాగబాబు మాత్రమే. మెగా కుటుంబం తరఫున మీడియా ముందుకు వచ్చి ఎలాంటి అపవాదులు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు గారు వివరణ ఇస్తారు. అయితే అప్పుడప్పుడు నాగబాబుగారు సోషల్ మీడియాలో పవర్ ఫుల్ పోస్ట్ లు పెడుతూ ఉంటాడు. ఏ పార్టీ మీదైనా సెటైరికల్ పోస్టులు పెడతాడు అవి ట్రేండింగ్ అవుతాయి. నాగబాబు వేసే పోస్ట్లు ఓ రేంజిలో ఉంటాయి. అయితే కరోనా విషయంలో కూడా కేవలం వైద్యులు మాత్రమే కాపాడతారని ట్వీట్ చేశాడు.
అయితే ఇప్పుడు నాథురం గాడ్సే గురించి ట్వీట్ చేశాడు. నాథురం గాడ్సే ను సమర్థిస్తూ పోస్ట్ పెట్టాడు. అయితే మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను మన భారత్ లో కొంతమంది దేశభక్తుడిగా కీర్తిస్తారు. నాగ బాబు కూడా ఈ విషయం పై ట్వీట్ చేశాడు. అయితే ఈ రోజు నాథురం గాడ్సే పుట్టిన రోజు ఆయన నిజమైన దేశభక్తుడు. గాంధీ ని చంపడం అనేది చర్చనీయాంశం. అయితే నాథురం వాదనను కూడా అప్పట్లో మీడియా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి మాత్రమే పని చేసింది. గాంధీ ని చంపడం వలన నాథురం గాడ్సే కి అపఖ్యాతి వస్తుందని తెలిసినా కూడా ఆ పని చేశాడు. గాడ్సే దేశభక్తిని శంకించలేము. పాపం నాథురం గాడ్సే may his soul rest in peace అని ట్వీట్ చేశారు నాగబాబు.