ఎన్టీఆర్ గురుంచి. ఎన్టీఆర్ తర్వాతి సినిమా విశేషాలు

ఎన్టీఆర్ ఈ పేరే ఒక సంచలనం నటన లో గాని డ్యాన్స్ లో గాని ఎంతో అద్భుతంగా చేస్తాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో తన విజయాన్ని స్టార్ట్ చేశాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వజ్రం లాంటి వాడు. అద్భుతమైన నటన అంతకంటే అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులని అలరిస్తాడు. సింహాద్రి సినిమా తో అంతులేని మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఏ సినిమా అయినా ఏ క్యారెక్టర్ ఇచ్చిన సరే ఎన్టీఆర్ దుమ్ము లేపు తాడు. నవరసాల్ని అద్భుతంగా పండించగలడు. కరెక్టుగా చెప్పాలంటే తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్ కోసం దర్శకులంతా ఇంకా అద్భుతమైన కథలు రాయాలి ఎందుకంటే ఎంత బాగా రాస్తే అంతకంటే బాగా చేయగలడు . ఎన్టీఆర్ అమేజింగ్ టాలెంటెడ్ పర్సన్. అదుర్స్ , జైలవకుశ, టెంపర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.
అయితే ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆరఆర్ ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఇందులో చరణ్ మాత్రం అల్లూరి పాత్రను పోషిస్తున్నాడు. అయితే రాజమౌళి తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకి “ఆయనను పోయి రావాలి హస్తినకు” అనే టైటిల్ పెడుతున్నట్లు తెలిసింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయింది. అయితే మే నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అనౌన్స్మెంట్ జరుగుతుందని తెలిసింది. పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలిసింది. ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్.