పవన్ కళ్యాణ్ అమితాబ్ గురుంచి ఎమోషనల్ ట్వీట్

కరోనా వైరస్ సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఇండియా లోనే అతి పెద్ద స్టార్ అయినా అంతా బచ్చన్ కి కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలిసిన సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆందోళన పడుతున్నారు. అమితాబచ్చన్ త్వరగా కోలుకోవాలని దేశమంతా కోరుకుంటుంది.
ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అమితాబచ్చన్ గారికి కూలీ సినిమా సమయంలో గాయమైనప్పుడు నేను ఎంతో బాధ పడ్డాను మా ఫ్యామిలీ అంతా మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని ఆ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మీరు ఎప్పుడు అమితమైన ప్రేమను ఆప్యాయతను చూపించారు అందరిపైనా మీరు పోరాడే శక్తిని, సింప్లిసిటీ నీ చూసే మేమంతా ప్రేమిస్తాం అన్నాడు పవన్. ధన్వంతరి శక్తి తో మీకు అభిషేక్ బచ్చన్ గారికి త్వరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.