పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఫాన్స్ సోషల్ మీడియా

మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కూడా పెద్ద హీరోల అభిమానుల మధ్య ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఒక హీరో బద్దలుకొట్టిన రికార్డ్స్ ని మరొక హీరో బద్దలు కొడుతూనే ఉంటాడు. అయితే ఇది సినిమా విషయంలోనే కాదు ట్విట్టర్లో ట్వీట్ విషయంలో కూడా జరుగుతుంది. మహేష్ బాబు బర్త్ డే కి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువ వచ్చాయని ఒకరిని మించి ఒకరు ట్వీట్స్ చేస్తూ వాదులాడుకుంటున్నారు. అయితే పోకిరి విషయంలో ఎక్కువ ట్వీట్స్ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ తర్వాత ఆ రికార్డుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బద్దలుకొట్టారు. గబ్బర్ సింగ్ ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా ట్విట్టర్లో రచ్చ లేపారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

దేశంలోనే అందరి కంటే ఎక్కువ ట్వీట్ చేశారు ప్రతి సారి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ కి సినిమా పరంగా రికార్డులు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు అది కాస్త తగ్గి పోయింది. ఇలాంటిదే తమిళనాడులో కూడా జరుగుతుంది ఎప్పుడు విజయ్, అజిత్ అభిమానుల మధ్య హంగామా సోషల్ మీడియాలో ఉంటుంది తమ హీరో లకు సంబంధించిన సినిమా ల విషయం లో ట్వీట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ రికార్డులు ట్వీట్స్ పరంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ టాప్ హీరోలు అందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. పవన్ కళ్యాణ్ అర్జున్ సినిమా టైంలో మహేష్ బాబు కి ఎంతో హెల్ప్ చేశాడు. మహేష్ బాబు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో నటించడానికి రెడీ అని అన్నాడు.