ఆర్ జి వి పవర్ స్టార్ సినిమా: హీరోని తిట్టమని చెప్పడట !పూనమ్ కౌర్

రాంగోపాల్ వర్మ ట్విటర్ లో ఎదో ఒక వివాదాస్పద పోస్ట్స్ లు పెడతాడు. ఎవరినైనా ఏమైనా అనాలనుకుంటా డైరెక్ట్ గాకానీ ఇండైరేక్ట్ గా కానీ ట్విట్టర్లోనే పోస్ట్ పెడతాడు. అయితే త్వరలోనే మరో సినిమాకి అనౌన్స్ చేసి పవర్ స్టార్ అనే టైటిల్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత పూనమ్ కౌర్ దానికి కౌంటర్ గా ట్విట్ చేసింది.
బ్రేకింగ్ న్యూస్ తన తర్వాతి సినిమా పేరు పవర్ స్టార్ అని అందులో 8 బర్రెలు 4 నలుగురు పిల్లలు ఒక రష్యన్ మహిళ ఉంటుందని రాశాడు వర్మ. అంతే కాదు టిక్ టాక్ ఫేమస్ పవన్ కళ్యాణ్ తన హీరో అని ప్రకటించాడు. వర్మ ఇలా కామెంట్ చేసిన తర్వాత పూనమ్కౌర్ వర్మ ను కూడా ఇందులో జత చేయమని చెప్పింది. అమ్మాయిల బలహీనతలు తెలుసుకొని వాళ్ళని తీవ్ర రెచ్చగొట్టడం లాంటి పనులు చేసే వారి పాత్రను కూడా ఈ సినిమాలో పెట్టాలి అని అంది. కానీ చిన్నతనంలో నిన్ను ఎంతో గౌరవించే దానిని ఇప్పుడు చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చింది. ఒక డైరెక్టర్ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడాలని తనను గంటసేపు బ్రెయిన్ మాస్ చేశాడని చెప్పుకొచ్చింది. కొందరు మీడియా వారు తన ఉద్దేశాన్ని నాకు తెలియజేశారు తను పంపిన మెసేజ్ లను ఆ పార్టీ వారికి పంపాను. కొంతమందైనా నిజాయితీ వ్యక్తులు ఉన్నందుకు ఆ దేవుడికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే నాడు శ్రీ రెడ్డి ని బూతులు తిట్టమని అని చెప్పింది రాంగోపాల్ వర్మ అనే విషయం అందరికీ తెలిసిందే.