రాహుల్ సిప్లిగంజ్ తో వస్తున్న గాసిప్స్ పై స్పందించిన పునర్నవి

తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన పునర్నవి కి అంతగా పేరు రాలేదు బిగ్బాస్ లో అవకాశం పొందిన తర్వాత పునర్నవి కి మంచి క్రేజ్ వచ్చింది అందులో చేసినా రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రేక్షకులు కూడా రాహుల్ పునర్నవి మధ్య ఏదో ఉంది అని ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చాలా గాసిప్స్ వచ్చాయి. బిగ్ బాస్ లో వీరిద్దరి జోడి మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టింది. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ విషయంపై పునర్నవి ఎట్టకేలకు మాట్లాడింది. మా మధ్య అలాంటిదేమీ లేదని మేమిద్దరం మంచి స్నేహితులం అని అంటుంది. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదని అంది. అయితే తాను ఒత్తిడిలో ఉన్నానని ఇప్పుడిప్పుడే బయట పడుతున్నానని చెప్పింది.