పవన్ కళ్యాణ్ కోసం మంచి కథ రాస్తాను అంటున్న రాజమౌళి తండ్రి.
rajamouli father about pawankalyan

విజయేంద్రప్రసాద్ ఒక స్టార్ డైరెక్టర్ కి తండ్రిగా మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన కథా రచయితగా పేరు సంపాదించుకున్నాడు. రాజమౌళి చేసే సినిమాలన్నీ కథను అందించేది విజయేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి వరస విజయాలు సాధిస్తున్నడు అంటే అందులో విజయేంద్ర ప్రసాద్ గారి పాత్ర ఎంతో ఉంది. అయితే విజయేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. “ఎంతో నిజాయితీపరుడు మంచివాడు తను అనుకున్నది కచ్చితంగా చేస్తాడు” అని అన్నాడు. కొన్ని సరైన కథలు ఎంచుకోక పోవడం వల్ల అవి ఫ్లాప్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ జానీ అనే మంచి కథ రాశాడు. కానీ అది సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆడలేదు. ఇంకెవరైనా రచయిత అయి ఉంటే అది సూపర్ హిట్ అయ్యేది. అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ కి ఒక అద్భుతమైన కథ రాస్తాను అని అన్నాడు విజయేంద్రప్రసాద్.