నాగబాబు కు వర్మ సపోర్ట్ . గాడ్సే పైన సినిమా అసలు విషయాలు

మెగా బ్రదర్ నాగబాబు గారు నాథురం గాడ్సే పై చేసిన ట్వీట్లు పోస్ట్ లు సోషల్ మీడియా లో పాపులర్ అయ్యాయి. అయితే గాడ్సే పుట్టినరోజు సందర్భంగా నాగబాబు గాడ్సే ఒక దేశభక్తుడని గాంధీ ని ఎందుకు చాపాల్సి వచ్చిందని, అతని వైపు కూడా వాదన వినాలని అన్నాడు. దీనిపై కొంత మంది వివాదం చేయగా నాగ బాబు వివరణ ఇచ్చుకున్నాడు.
అయితే తాజాగా రాంగోపాల్ వర్మ ఈ విషయంపై స్పందిస్తూ నాగబాబు కు సపోర్ట్ గా నిలిచాడు. అంతేకాదు గాడ్సే పైన ఒక్క సినిమా కూడా తీస్తా అని అన్నాడు. నాగబాబు మాటలకు మద్దతిచ్చిన వర్మ మాట్లాడుతూ నాథురం గాడ్సే గాంధీ ని చంపాడని మాత్రమే మనకు తెలుసు కానీ ఎందుకు చంపాడు ఎవరికీ తెలియదు ఎవరు చెప్పడం లేదు కూడా. గాంధీ ని ఎందుకు చంపాడు తెలియకపోవడం వల్ల అతను విలన్ అయ్యాడు మామూలుగా గాడ్సే గాంధీ ఫాలోవర్ స్వాతంత్రం వచ్చింది భారత్-పాక్ రెండు విడిపోయాయి గాడ్సే అనుకున్నవి జరిగిపోయాయి. అయినా కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది ఆ విషయం అప్పటి ప్రభుత్వం చెప్పలేదు. బయటకు రానివ్వలేదు ఎందుకంటే ఆ టైంలో అది కరెక్ట్ కాదు కావచ్చు. అప్పుడే స్వాతంత్రం వచ్చింది గాంధీ జాతిపిత అని చెప్పాము . ఏదిఏమైనా నాగబాబు గారి వాక్యల తో నేను ఏకీభవిస్తున్నాను అని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. గాడ్సే పైన ఒక సినిమా కూడా తీస్తున్నా అని చెప్పాడు.