బెస్ట్ బాడీ ఇదే అంటూ వర్మ ట్వీట్


రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ లో చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక స్టార్ హీరో ఫోటోని షేర్ చేశాడు. వర్మ ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అయితే గతంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో సినిమా తీసి సంచలనం సృష్టించాడు. అయితే ఇప్పుడు తన అకౌంట్లో ఒక స్టార్ హీరోను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు. అతను ఎవరో కాదు నందమూరి జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు షేర్ చేశాడు. మియా మాల్కోవా తర్వాత నేను చూసిన ది బెస్ట్ బాడీ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. సిక్స్ ప్యాక్ ఫోటో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకు ఇప్పుడు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫోటో ను ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ షేర్ చేశాడు. మే 20 నా ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.