వర్మ ఏంటి ఎలా అయ్యాడు అంటున్నారు..నాకు నచ్చలేదు అంటున్న రచయత

ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే ఇప్పుడు చాలామంది ఇలా అనుకుంటున్నారు వర్మ ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు. ప్రతిసారి ఏదో వివాదాస్పద సినిమా తీయడం అది ఫ్లాప్ అవడం జరుగుతుంది. కొంతమంది వర్మ ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు తిస్తున్నాడో అర్థం కావడం లేదు అని అంటున్నారు. అయితే తాజాగా వర్మ పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నానని ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. అయితే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఇండైరెక్ట్‌గా స్పందించారు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మిమ్మల్ని చూసి తెలుగు వాళ్లకు ఒక మణిరత్నం దొరికాడు అని అనుకున్నాను. మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏవేవో సినిమాలు చేస్తున్నారు. మీతో కటీఫ్ మీరు ఏమి రిప్లై అక్కర్లేదు. నేను హర్ట్ అయ్యాను అని కామెంట్ చేశాడు శాస్త్రి. అయితే రామజోగయ్య ఇలాంటి కాంట్రోవర్సీ లకు స్పందించడు. వర్మ ఇలా చేయడంపై స్పందించక తప్పలేదు.