అతి తెలివితేటలతో మాట్లాడుతున్న వర్మ : పవర్ స్టార్ పై స్పందన

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్యనే పవర్ స్టార్ అనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అందులో టిక్ టాక్ స్టార్ ని ఎంపిక చేసినట్టు చెప్తున్నాడు. అతను అచ్చం పవన్ కళ్యాణ్ లాగానే ఉన్నాడు అని వర్మ అన్నాడు. అయితే ఈ టైటిల్ పై వస్తున్న విమర్శలపై వర్మ స్పందించాడు. పవర్ స్టార్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి అని అందరూ అంటున్నారు. ఈ విషయంపై ఆర్జీవి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని మీరంతా ఎక్కువగా ఉహిస్తున్నారని అంటున్నాడు. పవర్ స్టార్ సినిమా పవర్ స్టార్ గురించి అని వస్తున్న రూమర్స్ అంత నిజం కాదని అదంతా పైగా బాధ్యతారాహిత్యం తో కూడుకున్న పని అని అన్నాడు. రాజకీయ పార్టీని ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యక్తి గురించి తీస్తున్న చిత్రమే. ఇది ఒక కల్పిత చిత్రం అయితే ఈ సినిమాలో నటించబోతున్న వ్యక్తి ఎవరైనా ఎవరి లాగానే ఉంటే అది ఓన్లీ యాదృచ్చికమే అని అంటున్నాడు రాంగోపాల్ వర్మ. అంటే మళ్లీ ఒకసారి అందరి చెవిలో పువ్వు పెడుతున్నాడు ఏదో ఒకటి చెప్పి తెలివిగా తప్పించుకున్నాడు అని అందరు అంటున్నారు.