రామ్ గోపాల్ వర్మ కామెంట్.. RRR సినిమా ప్లాప్ అయితే చాలామంది

దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎప్పుడు ఎవర్నో ఒకర్ని అనడం అంటే చాలా ఇష్టం. వర్మ తరచుగా ట్విట్టర్లో పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అందులో కొన్ని వివాదాస్పదమ్ అవుతూ వుంటాయి. మొన్న ఈ మధ్య నాగబాబు గాడ్సే పై చేసిన కామెంట్స్ ని వర్మ సమర్ధించాడు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాపై కూడా కామెంట్ చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుంది అని అన్నాడు.
అయితే సినిమా ఇండస్ట్రీలో కొంత మంది మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అందరం కలిసే ఉన్నామని అంటూ ఉంటారు. ఇదే విషయంపై వర్మ అలా చెప్తే అంత కంటే పెద్ద బూతు ఉండదు అని అన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పై ఫ్లాప్ అయితే చాలా మంది ఇండస్ట్రీలో బయటకు వచ్చి చొక్కాలు విప్పి మందు బాటిల్ తో ఆనందిస్తారని అన్నాడు. నిజానికి సినిమా భారీ హిట్ జరిగితే ఎవరు తట్టుకోలేరు చాలా మంది కుళ్లుకుంటారు. ప్రతి వాడి లో ఈ కుళ్లు అనేది ఉంటుంది అని అన్నాడు. పాలిటిక్స్ లో అయినా బిజినెస్ లో అయినా ఎవరైనా ఎదుగుతుంటే ఇతరులు కుళ్లుకుంటారు అని కామెంట్ చేశాడు రాంగోపాల్ వర్మ.