నన్ను ఏమైనా అంటే బస్సు లు ఏసుకొని వస్తారు ..వర్మ

రాంగోపాల్ వర్మ ని తన ఫ్రెండ్స్ ఎప్పుడూ నీ లా బతకాలని వచ్చే జన్మలో అయినా నీలా ఉండాలని అంటారట . అయితే సింపుల్గా నేను చెప్పిన మూడు పనులు చేయండి అని అంటారట వర్మ. నేను రూట్ క్లియర్ చేయడమే కాదు రూల్స్ బ్రేక్ చేస్తాను కూడా అంటున్నాడు. వర్మ పై వచ్చిన రూమర్స్ శివ సినిమా తర్వాతనే వచ్చిందట రూమర్స్ వస్తున్నాయి అంటే మన ఇమేజ్ పెరిగినట్టే కదా అన్నాడు వర్మ.
నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా కొన్ని రూమర్స్ క్రియేట్ చేసే వాడిని. నెహ్రూ, వంగవీటి రాధా ఈ రెండు గ్రూపుల సపోర్ట్ నాకు లేదు. కాకపోతే హైదరాబాదులో ధూల్పేట గుండాలు పాతబస్తీ రౌడీలు నాకు తెలుసు. నన్ను ఏమైనా అంటే వాళ్ళు బస్సు ఏసుకుని వస్తారు అని చెప్పేవాడిని ఇదంతా వాళ్ళు నమ్మేవారు.
చాలా మంది ఫ్రెండ్స్ ని నీలా బతకాలని అంటుంటారు. మామూలుగా మీరు పెళ్లి పిల్లలు అంటూ టైం వెస్ట్ చేస్తూ ఉంటారు. నేను అలా చేయను. నాకు ఏది అనిపిస్తే అది చేస్తా సొసైటీని, ఫ్యామిలీ, దేవుడిని ఈ మూడింటిని వదిలేయాలి అప్పుడే నాలా బతకొచ్చు అంటున్నాడు వర్మ.