బాల్లయ్య పై మళ్ళీ సెటైర్ వేసిన రామ్ గోపాల్ వర్మ

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అంగరంగ వైభవంగా బాలయ్య ఫాన్స్ ఇరవై ఒక్క వేల పైగా కేకులు కట్ చేసి రికార్డు సృష్టించారు. అయితే పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ పాట శివశంకరి పాటను పాడారు. అయితే ఈ పాటను చాలా మంది విమర్శలు చేశారు. వర్మ, నాగబాబు లాంటివారు సెటైర్స్ కూడా వేశారు.
వావ్ మహమ్మద్ రఫీ, బాలసుబ్రహ్మణ్యం లాంటివారు కూడా బాలయ్య ముందు జూనియర్ లే అని అన్నాడు. కొంతమంది తన పోస్ట్ ను జోక్ చేశారని అంటున్నారు. దేవుడు, బాలయ్య మీద ఒట్టేసి చెబుతున్నా సంగీతం కనిపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నేను విన్న పాట లో ఇదే బెస్ట్ అని అన్నాడు. నాకు తెలిసి ఎన్టీఆర్ కూడా స్వర్గంలో గంతులు వెస్తారని అన్నారు. మరి బాలయ్యకు మీ సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తారని అడగ్గా బాలయ్యకు నేను అవకాశం ఇవ్వలేదని ఆయన పాట పాడే స్థాయి వేరు నాది చాలా చిన్న సినిమాలని వర్మ అన్నాడు.