భారీ ఆఫర్ కి నో చెప్పిన హీరో రామ్ !

కరోనా కారణంగా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని రెడీగా ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓ టి టి లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లు సినిమాలు షూటింగ్ లు అన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని షూటింగ్ మొదలవుతున్నాయి.
అయితే రామ్ నటించిన రేడ్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. కొంతమంది ఓ టి టి లో రిలీజ్ చేయాలని రామ్ కి భారీ ఆఫర్ ఇచ్చారట. కాకపోతే రామ్ దీనికి ఒప్పుకోలేదని తెలుస్తోంది మొదటగా 25 కోట్లు తర్వాత 30 కోట్లు ఆఫర్ ఇచ్చినా సరే రామ్ ఒప్పుకోలేదని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో సినిమా విడుదలైతే కానీ తెలియదు.
మూవీ నేమ్ : రెడ్
హీరో : రామ్
హీరోయిన్స్ : మాళవిక శర్మ, నివేత పెతు రాజ్, అమ్రితా అయ్యర్