రేణుదేశాయ్ కి ఛాన్స్ ఇవ్వబోతున్న మహేష్ బాబు !

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే . MB ప్రొడక్షన్ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు యువ హీరోలతో సినిమా చేస్తున్నాడు. మహేష్ నిర్మాతగా అడివి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా వస్తుంది. ఎవరు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా వస్తోంది. మహేష్ బాబు నిర్మాత గా ఉన్న ఈ సినిమాలో రేణుదేశాయ్ కి ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్ తో అడివి శేష్ చాలా క్లోజ్గా ఉంటారు. వీరిద్దరి పరిచయం వల్ల రేణుదేశాయ్ కి అవకాశం వచ్చింది. అకీరానందన్ తో పరిచయం ఉండడం వల్ల అడవి శేషు రేణుదేశాయ్ ని సంప్రదించారు. మేజర్ అనే సినిమాలో రేణుదేశాయ్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. రేణు దేశాయ్ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాని గూడచారి డెరెక్టర్ కిరణ్ శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.