సుశాంత్ సింగ్ సోదరిపై రియా సంచలన ఆరోపణలు ..అసభ్యంగా

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అందరూ కోరుతున్నారు. సుశాంత్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర మహిళకి సైన్యంలో సర్జన్ గా పనిచేసిన వ్యక్తి కి పుట్టిన అమ్మాయిగా తనను పేర్కొంది. తనపై వస్తున్న ఆరోపణలను ఒట్టి అబద్ధాలేనని చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కట్టుబడి ఉన్నానని అంటుంది.
అయితే సుశాంత్ సోదరి గురించి మాట్లాడుతూ ఒక రోజు రాత్రి నేను సుశాంత్ ఫ్లాట్ లోనే ఉన్నాను . అప్పుడు ఆరోజు రాత్రి సుశాంత్ సోదరి బాగా తాగి నా రూమ్ లోకి వచ్చింది నాతో అసభ్యంగా బిహేవ్ చేస్తు నన్ను తడిమింది. అప్పుడు నేను రూమ్ లో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పాను. అయితే మరుసటి రోజు ఈ విషయాన్ని గురించి సుశాంత్ కి చేప్పాను. తర్వాత సోదరి తో గొడవ పడ్డాడు. ఈ గొడవతో రియాకు సుశాంత్ కుటుంబానికి గొడవలు మొదలయ్యాయి అని వివరించింది. రియా ప్రియా ఆరోపణలపై సుశాంత్ కుటుంబం తీవ్రంగా ఖండించింది.