శ్రీయ చేసిన పనికి రాజమౌళి సీరియస్ | రాంచరణ్ ఎన్టీఆర్ |

రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే రాజమౌళి తన సినిమాల గురించి కానీ సినిమా తీసేటప్పుడు కానీ ఎలాంటి హింట్ ఇవ్వడు. దానికి సంబంధించిన విశేషాలను చాల రహస్యంగా ఉంచుతాడు. సినిమా గురుంచి హీరోలు కూడా మీరు రాజమౌళినే అడగండి అని చెప్తారు. సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తాడు. ఎలాంటి అవకాశం ఉండదు. అయితే తాజాగా శ్రియ నేను రాజమౌళి సినిమాల్లో నటిస్తున్నానని అజయ్ దేవగన్ తో భార్య పాత్ర పోషిస్తున్ననని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తానని చెప్పింది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని తన పాత్ర గురించి కూడా చెప్పడంతో రాజమౌళి సీరియస్ అయ్యాడు అని అంటున్నారు. రాజమౌళి తన సినిమా గురించి ఎలాంటి విషయాలు బయటకి రావడం సహించడు. అలాంటిది శ్రేయ ఓపెన్ గానే చెప్పింది . రాజమౌళి ఈ విషయంపై సీరియస్ గా ఉన్నాడని గాసిప్స్ వినబడుతున్నాయి.