సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రికార్డు కలెక్షన్స్

సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రికార్డు కలెక్షన్స్
Sai Dharam Tej Solo Brathuke So Better Movie Record Collections
చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా లు థియేటర్ ల లో రిలీజ్ అవుతున్నాయి. అయితే మొదటిగా సినిమా థియేటర్ లోకి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్నాయి. సోలో బ్రతుకే సో బెటరూ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్లు రాబడుతోంది. ప్రతి రోజు పండుగ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. టాలీవుడ్ హీరోలు అంతా సపోర్ట్ చేయడంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 21 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ మొత్తం తొమ్మిది కోట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మొత్తం వరల్డ్ వైడ్ గా 12 కోట్లు కలెక్షన్ కి వచ్చినట్లు తెలుస్తుంది.