సల్మాన్ ఖాన్ డబ్బులు పంచుతున్నాడనేది నిజమేనా
salman Khan distribution Money True or Not

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ ఉంటాడు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా తన దగ్గర పనిచేసే వ్యక్తులకు కొంత మందికి సహాయం చేశాడు. సల్మాన్ ఖాన్ విషయంలో సోషల్ మీడియాలో డబ్బు సహాయం చేస్తున్నాడు అని పుకార్లు కూడా బాగా వస్తున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ పేద ప్రజలకు డబ్బు సంచులతో డబ్బులు పంచుతూ ఉన్నాడని రూమర్ ముంబైలో సర్క్యులేట్ అయింది. ఫలానా ఏరియా కు వస్తే డబ్బులు ఇస్తాడు అని అందరూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వార్త నిజం అనుకుని చాలా మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో ఇలాంటి రూమర్ రావడంతో ప్రజలందరూ ఒకే దగ్గరికి వస్తారని అందరూ భయపడ్డారు. అయితే కొంత మంది జనం ఒకే దగ్గర ఉండడంతో అక్కడికి పోలీసులు వచ్చి ఎవరికీ ఎలాంటి డబ్బు పంచడం లేదు అని షాక్ ఇచ్చారు అదంతా రూమరే అని చెప్పి అక్కడి నుంచి అందర్నీ పంపించారు పోలీసులు.