సమంత చై ఎక్కడికి వెళ్తున్నారు

జోష్ సినిమాతో నాగచైతన్య మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. అలాగే ఏం మాయ చేసావే సినిమా తో సమంత పరిచయమైంది . వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వాళ్ళ కెరీర్లో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడ సినిమా షూటింగులు లేవు. అయితే ఈ సమయాన్ని అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అంతేకాకుండా తన అభిమానులను అలరించడానికి సోషల్ మీడియా ని వాడుకుంటున్నారు. ఏదో ఒక వీడియో తో ముందుకు వస్తున్నారు.
సోషల్ మీడియాలో అయితే తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ ఫోటో ఏంటంటే సమంత అండ్ నాగ చైతన్య ఇద్దరు కలిసి బైక్ మీద ఎటో వెళ్తున్నట్టు ఆ ఫోటో ఉంది . సమంత హెల్మెట్ పట్టుకుని నాగచైతన్య బైక్ పైన ఇద్దరు కలిసి ఫోటో దిగారు. అయితే ఈ ఫోటో చూసిన వాళ్ళందరూ లాక్ డౌన్ కదా ఈ సమయంలో ఎక్కడి కెళ్తున్నారు ఎక్కడి కి వెళ్లడానికి వీలు లేదు కదా అని అనుకుంటున్నారు . అయితే ఇది ఎప్పటిదో ఫోటో ఇపుడు పెట్టిఉండవచ్చు అని అనుకుంటున్నారు.