వరూధిని సీరియల్ ఫేమ్ రవికృష్ణ కి కరోనా ఎలా వచ్చింది ?

కరోనా కారణంగా సినిమాలు షూటింగ్ సీరియల్స్ అన్నీ చాలా రోజులుగా బంద్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని షూటింగులు సీరియల్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న ఆర్టిస్టులు కూడా కరోనా సోకుతుంది. నా పేరు మీనాక్షి ఫేమ్ నవ్య స్వామి కి కోవిడ్ అని తేలింది. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పింది. అయితే మొగలిరేకులు సీరియల్ తో పరిచయమైన రవికృష్ణ ఆ తరువాత వచ్చిన వరదనీ పరిచయం తో బాగా ఫేమస్ అయ్యాడు. అంతేకాదు బిగ్ బాస్ లో కూడా రవి కృష్ణ సెలెక్ట్ అయి మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే తనకు కూడా కరోనా సోకిందని ఈ మధ్యనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే కరోనా ఉండటంవల్ల ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంన్నారు అని చెప్పాడు. శివ జ్యోతి లో జరిగిన లైవ్ చాట్ లో తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పాడు. మేము ఆర్టిస్టులను కాబట్టి మాస్కు పెట్టుకోకుండా షూటింగ్ చేయవలసి ఉంటుంది మాస్క్ పెట్టుకోకపోవడం వల్ల కరోనా వచ్చింది అని అనుకుంటున్నాను. నేనిప్పుడు బాగానే ఉన్నాను ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే శివజ్యోతి పెళ్ళెప్పుడు అని అడగ్గా ఇలాంటి టైమ్ లో ఈ ప్రశ్న ఎవరైనా అడుగుతారా అని త్వరలో చేసుకుంటానని చెప్పాడు .