పవన్ మహేష్ గురుంచి చెప్తూ ! ఎన్టీఆర్ సైలెంట్ అని అంటున్న శ్రియ శరన్

శ్రేయ శరణ్ తెలుగు టాప్ హీరోలందరితో నటించింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతేకాదు తమిళ సినిమాల్లో కూడా నటించింది. శ్రేయ మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి గారి తో ఠాగూర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ సినిమాతో ఎంతో పేరు తెచ్చుకుంది. అంతేకాదు కుర్ర హీరోలు అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పక్కన కూడా నటించింది. ఇష్టం సినిమాతో తెలుగు లో కెరీర్ ని ప్రారంభించి తర్వాత వరుస విజయాలను అందుకుంది. అయితే శ్రియ పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిలైంది. ఈ మధ్య ఫ్యాన్స్ తో మాట్లాడుతూ నేను రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నానని చెప్పింది అంతేకాదు తెలుగు హీరోల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి అడగగా పవన్ కళ్యాణ్ ఒక పుస్తకాల పురుగు అని ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు అని అంది. ఎన్టీఆర్ గురించి చెబుతూ తను అప్పుడు సైలెంట్ గా ఉండేవాడిని ఇప్పుడు చాలా మారిపోయారు అని అంది ప్రభాస్ కళ్లు చాలా బాగుంటాయని ఎప్పుడూ ప్రభాస్ కళ్ళని చూస్తూనే ఉండాలని ఉంటుందని అంది. రజినీకాంత్ గురించి చెబుతూ ఆయన ఒక పవర్ హౌస్ అని ఆయన నుంచి ఎన్నో జీవిత అనుభవాలు నేర్చుకున్నానని చెప్పింది శ్రేయ చెప్పింది.