సింగర్ సునీత కు కరోనా ఎలా వచ్చింది ..అయన మాత్రం కోలుకోవాలి

కరోనా పాజిటివ్ నిర్ధారణ మామూలు ప్రజలకే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఎక్కువగానే సోకుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ లకు హాజరు కావడం వలన ఇతరులని కలవడం వలన కరోనా సోకుతుంది. ఇటీవలనే రాజమౌళి సింగర్ సునీత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి కరోనా నిర్ధారణ అయింది. అయితే సింగర్ సునీత రాజమౌళి ఇటీవలనే కోలుకున్నారు. బాల సుబ్రహ్మణ్యం చెన్నై ఆసుపత్రిలో చేరారు. బాలు గారి కోసం చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇలాంటి సెలబ్రిటీలు కూడా బాలు గారు తొందరగా కోలుకోవాలని ఆశించారు. తాజాగా సింగర్ సునీత కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు నా ఆరోగ్యం విషయంలో చాలా మంది ఫోన్ కాల్స్ చేసారు ఎలా ఉన్నారు అని అడిగారు. నేను బాగున్నాను అని ఎవరూ ఆందోళన చెందవద్దు అని చెప్పారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకునే చిన్న తలనొప్పికి నేను కరోనా టెస్ట్ చేయించుకున్నాను. దురదృష్టవశాత్తు వచ్చింది త్వరలోనే నేను కోలుకున్నాను ఇప్పుడు నేను చాలా బాగున్నాను అని చెప్పారు అయితే నా బాధ అంతా బాలసుబ్రమణ్యం గారి గురించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.