కరోనా కారణంగా వాయిదాపడ్డ నితిన్ పెళ్లి త్వరలో ఎక్కడ !

కరోనా కారణంగా చాలామంది తెలుగు సెలబ్రిటీల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. నిఖిల్, నితిన్ ఇద్దరు హీరోల పెళ్లిళ్లు పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. నిఖిల్ అయితే చాలా తక్కువ మంది తో ఫామ్ హౌస్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇలాగే నితిన్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నాడట. శాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ముందుగా నితిన్ దుబాయిలో అందర్నీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ కరోనా కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి ని చాలా సింపుల్గా హైదరాబాద్లోనే చేసుకోవాలని అనుకుంటున్నాడు. హైదరాబాద్ శివారులో ఒక ఫామ్ హౌస్ లో అత్యంత సన్నిహితులను పిలిచి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జులై చివరి వారంలో గానీ ఆగస్టు మొదటి వారంలో గానీ జరగవచ్చు.